NLG: చిట్యాల లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశం స్థానిక బీఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా గెలుపొందిన మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీతా రమేష్, కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఏర్పుల పరమేష్, నిమ్మనగోటి శ్రీనివాసులను ఈ సందర్భంగా అభినందించారు. క్లబ్ అధ్యక్షులు జనగాం రవీందర్ గౌడ్, నరసింహ, శ్రీకాంత్ పాల్గొన్నారు.