WGL: GWMC 20వ డివిజన్ పరిధి పద్మనగర్లో కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ అధ్యక్షతన గురువారం వార్డుసభ జరిగింది. MLC బస్వరాజు సారయ్య ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ప్రజలు గ్రామ సభలను సద్వినియోగపరచుకుని, తమ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అధికారులు వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలన్నారు.