HYD: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థత గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు.