Explosion in Bengaluru Rameswaram Cafe.. Four injured
Explosion: బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ముగ్గురు కేఫ్ సిబ్బంది కాగా, ఒకరు అక్కడికి వచ్చిన కస్టమర్ అని తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నవారు చికిత్స నిమిత్తం బాధితులను ఆస్పత్రికి తరలించారు. కేఫ్‌లో పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఘటనస్థలికి చేరుకున్న వైట్‌ఫీల్డ్ పోలీసులు పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో చిన్నపిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి:Bangladesh: ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది మృతి
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు
ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు హోటల్ సిబ్బంది.. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో భయాందోళనతో పరుగులు తీసిన జనం. pic.twitter.com/JF4zdxWGTD
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2024

