Viral: ఫిట్‌గా ఉంచుకోవడానికి మంచి ఆహారంతోపాటు వ్యాయామం ముఖ్యం. యోగా చేయాలి, నడవాలి. క్రమం తప్పకుండా చేస్తే, శరీరం ఫిట్‌గా ఉంటుంది. దీంతో మనసు చురుకుగా ఉంటుంది. వృద్ధులు జిమ్ చేయడం సరికాదని చాలామంది అంటుంటారు. వ్యాయామం, నడక మాత్రమే చేయాలని కోరతారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 68 ఏళ్ల వృద్ధురాలు బరువు ఎత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వైరల్ క్లిప్‌ను జిమ్ ట్రైనర్ అజయ్ సాంగ్వాన్ (@weightliftermummy) ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు. ఇంతకుముందు తన పేజీలో ఇలాంటి పోస్ట్‌లు షేర్ చేశాడు. అతని తల్లి వీడియో రికార్డ్ చేశారు. ఆమె వయసు 68 ఏళ్లు. ఈ వయస్సులో స్త్రీలు కృష్ణా రామా అంటూ దేవుని నామాన్ని జపిస్తుంటారు. వ్యాయామం చేసేందుకు ఆ వయసు వారు దూరంగా ఉంటారు. కొందరు యోగా ప్రయత్నిస్తుంటారు. అతని తల్లి జిమ్‌కి వెళ్లి తన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆమెను చూడటం చాలా మంది మహిళలు ఫిట్‌గా ఉండటానికి స్ఫూర్తినిస్తుంది.
బామ్మ కార్డియోతోనే కాకుండా బార్బెల్, డంబెల్ వంటి వాటితో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపిస్తుంది. వారం క్రితం షేర్ చేసిన వీడియో చూసిన తర్వాత ప్రజలు స్పూర్తి పొందుతున్నారు. ఈ వీడియోకు ఫుల్ లైక్‌లు వచ్చాయి.