WGL: పర్వతగిరి మండలం చౌటపల్లి–గోరుగుట్ట తండా ఎస్సారెస్పీ కెనాలి కాలువను పునరుద్ధరించి చౌటపల్లి, గోరు గుట్ట తండా, సోమారం గ్రామపంచాయతీ రైతులకు నీరు అందించే పని సర్పంచ్ విజయలక్ష్మి భాస్కర్ నాయక్ చేపట్టారు. మంగళవారం JCB సహాయంతో అడ్డుకున్న చెత్త చెదారాలను శుభ్రపరిచిన కార్యక్రమంలో వార్డు మెంబర్లు, స్థానిక నేతలు పాల్గొన్నారు.