రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామానికి చెందిన గ్రామ పంచాయితీ కార్యదర్శి మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. పిల్లలు లేకపోవడంతో ఆయన అంత్యక్రియల బాధ్యతను గ్రామస్తులే భుజాన వేసుకున్నారు. శ్మశానవాటికలో గుంత తవ్వడం నుంచి అంతిమ సంస్కారాల వరకు మహిళలు, పురుషులు కులమత భేదాలు లేకుండా కలిసి నిర్వహించారు.