NZB: టీయూలో ఇటీవల ఉద్యోగుల ఖాతాల్లో పడ్డ జీతాలు వెనక్కి వెళ్లిన విషయం తెలిసిందే. పలు సాంకేతిక కారణాల దృష్ట్యా సరి చేసి మళ్ళీ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేశారు. ఇదిలా ఉంటే గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం బయోమెట్రిక్ అటెండెన్స్‌ను టీయూ ఉన్నతాధికారులు మరింత కఠినతరం చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా జీతాల్లో కోత ఉంటుందని ఆదేశించింది.