»Woman Sees Her Own Heart On Display At Museum 16 Years After Transplant Surgery
Heart At Museum: తన గుండెను తాను మ్యూజియంలో చూసుకున్న యువతి
తన గుండెను తాను ఓ మ్యూజియంలో చూసుకున్న యువతి ఫీలింగ్స్ మాటల్లో చేప్పలేనివి. అది తనకు 22 ఏళ్లు జీవించేలా చేసిందని, ఇప్పుడు ఓ స్నేహితురాలిగా తన ముందు ఉందని అన్నారు.
మనిషి జీవనక్రమంలో గుండెది అతి ముఖ్యమైన పాత్ర. పుట్టుక నుంచి గిట్టేంతవరకు మనిషి ప్రాణాన్ని వెలకట్టేది గుండె ఒక్కటే. గుండె పనితీరు కారణంగానే మనిషి జీవితం ఆదారపడి ఉంటుంది. అలాంటి ఓ అమ్మాయి గుండెను 16 ఏళ్లక్రితం ఆపరేషన్ చేసి దాన్ని మ్యూజియంలో ఉంచారు. 38 ఏళ్ల బ్రిటన్ కు చెందిన జెన్నిఫర్ సటన్ అనే యువతికి ఆమె 22ఏళ్ల వయసు ఉన్నప్పుడు గుండె మార్పిడి చేయవలసి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి వైద్యులు పరిశోధన కోసమని ఆవిడ గుండెను భద్రపరిచారు. ఈ మధ్య ఆ యువతి గుండెను మ్యూజియంలో ఉంచారు.
22 ఏళ్ల వయసులో తన గుండె పనితీరు సరిగ్గా లేదని డాక్టర్లు తెలిపినట్లు చెప్పారు జెన్నిఫర్. దీంతో తనకు అవయవదానం వలన లభించిన మరొకరి గుండెను అమర్చారని ఇప్పుడు తాను ఆరోగ్యంగా ఉండగలుతున్నానని చెప్పారు. అయితే తన గుండెను తాను మ్యూజియంలో చూసుకోవడం మరిచిపోలేకుండా ఉన్నానని అన్నారు. హాంప్షైర్లోని రింగ్వుడ్కు చెందిన జెన్నిఫర్ సుట్టన్, లండన్లోని హంటేరియన్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచిన తన అవయవాన్ని చూడటం “నమ్మలేని వాస్తవం” అని పేర్కొన్నారు.
“మ్యూజియంలో ఉన్న గుండెను చూస్తుంటే నా స్రేహితురాలిగా ఉంది. ఇది నన్ను 22 సంవత్సరాలపాటు జీవించేందుకు తోడ్పడింది. ఇందుకు గర్వపడుతున్నాను. నేను జాడీలో చాలా వస్తువులను చూశాను ఇప్పుడు నా గుండెను ఒక జాడీలో చూడటం వింతగా అనిపిస్తుంది. అది నాది అనుకోవడం విచిత్రంగా ఉంది” అని అన్నారు జెన్నిఫర్.
నాకు మరొకరు అవదానం చేయడం వలన ఇప్పుడు బ్రతకగలుగుతున్నాను. నాలాంటి ఘటనలు అవయవదానానికి మరింత ప్రోత్సహించే ఉదాహరణలుగా నిలుస్తాయి. 22 ఏళ్ళ వయసులో కార్డియో ప్రాబ్లమ్ వచ్చిందని రక్తాన్ని పంప్ చేసేందుకు తన గుండెకు సామర్థ్యం లేదని గుండె మార్పిడీ చేయించుకోకపోతే చనిపోతానని వైద్యులు చెప్పారని అన్నారు. అయితే 2007 లో తనకు గెండె మార్పిడి చేశారని ఆతర్వాత తాను కొత్త జీవితాన్ని పోందినట్లు చెప్పారు. కాబట్టి తాను అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నానని అన్నారు.