VSP: వీఈఆర్ విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిని సమగ్ర ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీక్షా సమావేశంలో అభివృద్ధి పనులు, భూ సేకరణ, మాస్టర్ ప్లాన్ అమలుపై చర్చించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన తొలి ఎకనామిక్ రీజియన్ సమావేశంలో చర్చించిన అంశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.