VZM: కొత్తవలస కోటపాడు రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆదివారం రాత్రి ఓ దుకాణంలో దొంగతనం జరిగింది. దుకాణా యాజమాని సోమవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా వెనక ద్వారం గేట్లు తాళాలు తీసి ఉన్నట్లు గుర్తించారు. క్యాష్ కౌంటర్లో సుమారు రూ. 10 వేలు చిల్లర కాయిన్స్ తస్కరించినట్లు గుర్తించారు. పోలీసులకు పిర్యాదు చేయలేదని బాధితుడు పేర్కొన్నారు.