PLD: పాటిబండ్ల గ్రామంలో ముగ్గురురాజుల తిరుణాల మహోత్సవ వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు తిరుణాల మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దివ్య పూజా బలిలో ఫాదర్లు పాల్గొని ప్రత్యేక దీవెనలు అందించారు. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ముగ్గురు రాజుల దేవాలయంలో జరిగే తిరుణాల మహోత్సవానికి వేలాదిమంది పాల్గొంటరు.