విశాఖలోని 35వ వార్డు కల్లుపాకులకు చెందిన దేవరరత్నం, దేవరరాజుతో పాటు 100 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలే ఈ చేరికలకు కారణమని వాసుపల్లి వ్యాఖ్యానించారు.