నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లూరు మండలంలోని పురిణి పంచాయతీ పరిధిలో మంగళవారం పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తహసీల్దార్ లక్ష్మీనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.