PLD: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా 4వ శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నామని కలెక్టర్ అరుణ్ బాబు వెల్లడించారు. నేడు ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక పరిష్కార వేదికను నిర్వహిస్తామని చెప్పారు. షెడ్యూల్ కులాలు, తెగల ప్రజలు ప్రత్యేక పరిష్కార వేదికలను వినియోగించుకోవాలన్నారు.