»Saindhav Movie Review How Is Venkatesh Saindhav Movie
Saindhav Movie Review: వెంకటేశ్ సైంధవ్ మూవీ ఎలా ఉందంటే?
వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన సైంధవ్ ఈ రోజు విడుదలయ్యింది. మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సైంధవ్ కోనేరు (వెంకటేష్) చంద్రప్రవస్థలోని పోర్ట్‌లో జాబ్ చేస్తుంటాడు. ఆయనకు కూతురు గాయత్రి (సారా పాలేకర్) అంటే ప్రాణం. అదే కాలనీలో ఉండే మనోజ్ఞ (శ్రద్ధ శ్రీనాథ్)తో క్లోజ్‌గా ఉంటారు. మను తన భర్త నుంచి విడిపోతుంది. సైంధవ్ అంటే మనుకు ఇష్టం. అలాగే మను గాయత్రిని ప్రేమగా చూసుకుంటుంది. గతంలో సైకో కార్టెల్ సంస్థలో పనిచేస్తుంటాడు. అయితే పెళ్లి తర్వాత భార్యకు ఇచ్చిన మాట ప్రకారం కూతురే ప్రపంచంగా బ్రతుకుతుంటాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో కూతురికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే జబ్బు ఉన్నట్లు తెలుస్తుంది. దాని నుంచి బయటపడాలంటే రూ.17 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ వేస్తేనే బ్రతుకుతుందని డాక్టర్లు చెబుతారు. మరి సైకో అంత డబ్బును ఎలా సంపాదించాడు? తన బిడ్డ ప్రాణాల్ని కాపాడుకున్నాడా లేదా? సైంధవ్ పోరాటం ఎలా జరిగిందనే విషయాలు తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
అనుకున్న రీతిలో స్టోరీని స్క్రీన్‌పై చూపిస్తేనే సినిమా బాగుంటుంది. అయితే దర్శకుడు శైలేష్ తీసుకున్న పాయింట్ బాగుంది. ఒక ఇంజక్షన్ ఖరీదు 17 కోట్లు అనేది ఇంట్రెస్టింగ్గా అనిపించిన.. దాన్ని డీల్ చేసిన విధానం అంత గొప్పగా అనిపించలేదు. సినిమా మొదటి నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ కొన్ని దగ్గర్ల వేగం పుంజుకుంటుంది. తర్వాత ఒకచోటకి వచ్చి అక్కడే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. సినిమా చూడటానికి రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామాలా ఉంటుంది. కానీ ఇది మెడికల్ మాఫియా. అయితే అందరూ వెంకటేష్‌ను చూసి భయపడతారు? గతంలో సైంధవ్ ఏం చేశాడనే విషయాలు డైరెక్టర్ సరిగ్గా చూపించలేకపోయాడు. ఫస్టాఫ్ అంతా ఏదో యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ కనిపిస్తుంది. అయితే సెకండ్ ఆఫ్ మాత్రం అంత ఆసక్తికరంగా అనిపించలేదు. పాప సెంటిమెంట్ బాగానే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆ ఎమోషన్స్ కనెక్ట్ కావు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇందులో డ్రామా కంటే యాక్షన్ ఎక్కువైంది. కొన్ని ఫైట్ సీన్స్ బాగున్నాయి. సైంధవ్ ఫ్లాష్ బ్యాక్ కాస్త క్లారిటీగా చెప్పుంటే కథ డెప్త్ తెలిసేది. మొదటి నుంచి చివరి వరకు అంతా కాల్పుల మోతే కనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే?
వెంకటేష్ స్టైలిష్ పాత్రలో కనిపిస్తారు. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లోనూ తనదైన ముద్ర వేశారు. నవాజుద్దీన్ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. హిందీలో ఎక్కువగా సంభాషణలు ఉంటాయి. శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శర్మ, ముఖేష్ రుషి, జయప్రకాశ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా కెమెరా పనితీరు బాగుంది. సంతోష్ నారాయణన్ పాటలు, నేపథ్య సంగీతం, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు శైలేష్ కొలను కధను ఇంకొంత చెక్కి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
+వెంకటేష్ నటన
+యాక్షన్ సన్నివేశాలు
+నవాజుద్దీన్ పాత్ర
మైనస్ పాయింట్స్
-ఆకట్టుకోని కథనం
-పండని భావోద్వేగాలు