హైదరాబాద్: 28°C
వార్తలు

విద్య కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి కల్పనకు చర్యలు

MNCL: విద్య, వృత్తి విద్య కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ATC ప్రిన్సిపాల్‌లతో సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ATC ద్వారా ఉద్యోగం సాధించిన వారి వివరాలను ప్రచారం చేయాలన్నారు.