కృష్ణా: ఉంగుటూరు(M) ఇందుపల్లిలోని ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి అపహరించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యరుద్వతి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రకు సిద్ధమవుతున్న సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న 20 గ్రాముల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో శనివారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.