విశాఖ: నగరంలో సంక్రాంతిగా పండుగ సందర్భంగా ఒక పక్క షాపింగ్ మాల్స్, జ్యుయలరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. మరో వైపు గుట్టుగా పేకాట రాయుళ్ళు రెచ్చిపోతున్నారు. కంచెరపాలెం డీఎల్బీ గ్రౌండ్స్ వద్ద కోడి పందేలు నిర్వహిస్తుండగా ఆదివారం పోలీసులు దాడులు చేశారు. 10 మందిని అరెస్టు చేసి రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.