VZM: కాపు కార్పొరేషన్ ద్వారా తెలగ కులాలకు రుణాలు మంజూరు చేయాలని తెలగ సంక్షేమ సంఘం నాయకులు సీహెచ్. ప్రసాద్ బొబ్బిలి కోటలో ఆదివారం ఎమ్మెల్యే బేబీ నాయనకు వినతి పత్రం అందజేశారు. ఇదివరకే కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు మంజూరు అయ్యేటట్లు చర్యలు చేపట్టాలని కోరారు.