BDK: కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ అంకిత్‌ను రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొడాలి వెంకటేశ్వరరావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్చించినట్లు కొడాలి వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ రేషన్ డీలర్ నిమ్మలపూడి రాజయ్య పాల్గొన్నారు.