ATP: గార్లదిన్నె వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అనంతపురం నుంచి గుత్తికి బైక్పై వెళ్తుండగా ఐచర్ వాహనం ఢీకొట్టింది. బాధితులను సురేంద్ర, భాషగా గుర్తించారు. స్థానికులు వారిని గమనించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.