ELR: పెదవేగి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఏలూరు రేంజ్ ఐజీ జీ.వీ.జీ అశోక్ కుమార్ సందర్శించారు. చిత్తూరు జిల్లాకు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుల్స్‌తో సమావేశం అయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పోలీస్ వృత్తి సేవా ధర్మమని తెలిపారు. శిక్షణ సమయంలో BNS, BNSS చట్టాలు, ఆధునిక సాంకేతికత, సైబర్ క్రైమ్‌పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.