టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రపంచకప్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామీ అవార్డు విన్నర్, ప్రముఖ సింగర్ రిక్కీ మార్టిన్, పంజాబీ పాపులర్ సింగర్ సుఖ్బీర్ సింగ్ ప్రత్యేక ఆటపాటలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.