Arjun Tendulkar:మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండ్కూలర్‌ను (Arjun Tendulkar) కుక్క కరిచింది. ఈ విషయాన్ని ఆయనే.. స్నేహితులతో చెప్పాడు. లక్నో-ముంబై మధ్య ఈ రోజు మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా కుక్క కరిచింది. బౌలింగ్ చేసే ఎడమ చేతికి కరవడంతో ప్రాక్టీస్ చేయకుండానే వెళ్లిపోయాడు.
తనను కుక్క కరిచిందని అర్జున్ (Arjun) స్నేహితులతో చెప్పాడు. యుద్వీర్ సింగ్, మోసిన్ ఖాన్‌కు అర్జున్ చెప్పే వీడియోను మనం చూడొచ్చు. ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వీడియోను లక్నో ప్రాంచైజీ పోస్ట్ చేయడం విశేషం. జాగ్రత్తగా ఉండాలని అతని స్నేహితులు అర్జున్‌కు (Arjun) సూచించారు.
అర్జున్ టెండూల్కర్ (Arjun) 2021 నుంచి ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న.. ఈ ఏడాదే తుది జట్టులో చోటు దక్కింది. ముంబై జట్టు కూడా ఈ సీజన్లో పటిష్టంగా ఉంది. 12 మ్యాచ్‌లో 7 మ్యాచ్‌లు గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కీలక మ్యాచ్‌కు ఆల్ రౌండర్ అర్జున్ లేకపోవడం.. ఆ జట్టుకు లోటే అవుతుంది.
అండర్-19లో అర్జున్ టెండూల్కర్ (Arjun) చెలరేగిపోయాడు. 2018లో శ్రీలంక టూర్లో ఫస్ట్ క్లాస్ విభాగంలో సెంచరీ చేశాడు. అలా అండర్ 19 నుంచి ఐపీఎల్‌లోకి వచ్చాడు.