TG: తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా నియమితులవడం, ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ రాష్ట్రానికి తన సేవలు అందించిన జిష్ణుదేవ్తో సీఎం రేవంత్ ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. గౌరవ సూచకంగా ఆయనను కలిసి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపి, వీడ్కోలు పలకనున్నారు.