E.G: సీతానగరం గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర మహోత్సవంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు.