హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ల పేరుతో వందలాది మంది బాధితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన త్రిపుర కన్స్ట్రక్షన్స్ యాజమాన్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంస్థ ఎండీ పసుపులేటి సుధాకర్, ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి కుమార్తె, అల్లుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.