TG: SLBC ప్రాజెక్టులో 8 మంది కార్మికుల మరణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో రైతుబంధుపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ సర్కార్ 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే, తాము 90 లక్షల టన్నులు కొన్నామని చెప్పారు. రైతుబంధు ఎగ్గొట్టి, బీమా ఆపేసినందుకు రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?'
Advertisement
Advertisement
Advertisement


