పరకాల నుంచి పోటీపై కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ స్పష్టతనిచ్చారు. తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుంచే మొదలైందని, తన ప్రస్థానం కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతుందని ప్రకటించారు. పరకాల ఎమ్మెల్యేగా తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కొండా ఫ్యామిలీ నుంచి మరో రాజకీయ వారసురాలు వస్తుండటంతో పరకాల రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.