ATP: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర గణితం పరీక్షకు 15,740 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 269 మంది, ఒకేషనల్లో 139 మంది గైర్హాజరైనట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్ తెలిపారు. అలాగే హోలీ పండుగ సందర్భంగా మంగళవారం పరీక్ష ఉండదని, టైమ్ టేబుల్ ప్రకారం మార్చి 4 నుంచి పరీక్షలు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.