ప్రకాశం: సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి 71వ వార్షికోత్సవం, రథోత్సవ బందోబస్తును ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు సోమవారం పరిశీలించారు. ఇవాళ జరగనున్న రథోత్సవానికి ముగ్గురు DSPలు, నలుగురు CIలు, 40 మంది SIలతో కలిపి మొత్తం 650 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు.