తెలంగాణ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ TRS పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు రాజీనామా లేఖను పంపించారు. బూర నర్సయ్య గౌడ్ 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానంలో…TRS నుంచి పోటీచేసి గెలుపొందారు. 2019లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ ప్రస్తుత మునుగోడు ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థిగా తనకు టిక్కెట్ ఇస్తారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
చివరికి గత ఎన్నికల్లో పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. దీంతో నర్సయ్య గౌడ్ అసంతృప్తి చెంది పార్టీకి రిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీలు ఆర్థిక, సామాజిక రంగాల్లో వివక్షకు గురి అవుతున్నారని నర్సయ్య వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీ చేరిన బూర నర్సయ్య…బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది.