గుంటూరు ఆర్ అగ్రహారంలో నిర్వహించిన ఉచిత ఈఎన్టీ (ENT) వైద్య శిబిరాన్ని శనివారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 విధానం ద్వారా తమ నియోజకవర్గంలో 19 వేల కుటుంబాలను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే అందులో 11 వేల కుటుంబాలకు విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో చేయూతనిచ్చామని తెలిపారు.