శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత హెడ్ కోచ్ సనత్ జయసూర్య కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా శ్రీలంక-పాకిస్తాన్ మధ్య ఇవాళ మ్యాచ్ ముగిసిన తర్వాత పదవి నుంచి వైదొలగనున్నాడు. ఈ ఏడాది మార్చి 31 వరకు హెడ్ కోచ్గా సనత్ పదవీకాలం ఉంది. అయితే, ముందుగానే వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.