మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్.. తన సతీమణిపై ప్రత్యేకమైన ప్రేమను చాటుకున్నారు. భార్య చాన్ అడిగిందే తడవుగా డిస్కో పార్టీ ఏర్పాటు చేశారు. అలనాటి మ్యూజిక్కు తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ పార్టీలో అదరగొట్టారు. డిస్కోకు పార్టీవేర్ ప్యాంట్, షర్ట్‌తో పాటు సీక్విన్ జాకెట్లో జుకర్ బర్గ్ రాగా.. చాన్ సువర్ణ దుస్తుల్లో మెరిసిపోయారు. ‘డిస్కో క్వీన్ పార్టీ అడిగింది’ అని క్యాప్షన్ పెట్టి మార్క్ ఇన్ స్టాలో షేర్ చేశారు.