AP: కడప-చిత్తూరు హైవేలో కలకడ వద్ద ప్రైవేటు బస్సు ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సంబేపల్లి మండలం దేవపట్ల నుంచి సొరకాయలపేటకు ఆటో వెళ్తున్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.