KTR: సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనను ఫోన్లో పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని నారాయణమూర్తికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. రెండు రోజుల క్రితం అతను అస్వస్థతకు గురయ్యారు. ఈక్రమంలో ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. క్రమంగా ఆయన కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.
సినీ రంగంలో ఎంతో పాపులర్ అయిన దర్శక నటుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి తాజాగా ఓ ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు. ఆ ప్రెస్ మీట్లో నారాయణమూర్తి ఏమీ మాట్లాడలేకపోయారు. తనకు చాలా నీరసం ఉందని, కళ్లు తిరుగుతున్నాయని చెప్పారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండు నెలల క్రితమే నారాయణమూర్తికి గుండె బైపాస్ సర్జరీ జరిగింది.