భారత్‌లో త్వరలో ‘క్యూడెంగా’ డెంగ్యూ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన టకేడా కంపెనీ, హైదరాబాద్ బయో-ఇ సంస్థతో కలిసి ఈ టీకాను తయారు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి DCGI నిపుణుల కమిటీ నుంచి ఆమోదం లభించింది. 2026 నాటికి ఈ టీకా అందుబాటులోకి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. డెంగ్యూ మహమ్మారిని అరికట్టడంలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషించనుంది.