SDPT: ధర్మాజీపేట ప్రజలకు కొత్త బస్సు సేవ ప్రారంభించారు. దుబ్బాక బస్టాండ్ నుంచి ధర్మాజీపేట మీదుగా చేగుంట, జూబ్లీ బస్ స్టేషన్ వరకు ప్రయాణిస్తుంది. ధర్మాజీపేట సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభ కార్యక్రమం జరిగింది. దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేశ్, 7వ వార్డు కౌన్సిలర్ శోభ రాణి, విష్ణువర్ధన్ రెడ్డి, URDS డైరెక్టర్ వనం అశోక్, తదితరులు పాల్గొన్నారు.