MDK: చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.