VKB: ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం మర్చిపోయిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ఫిక్స్డ్ వేతనం చేస్తామని రూ.18 వేలు ఇస్తామని ఈఎస్ఐ, పీఎఫ్ ఉద్యోగ భద్రత రూ.50 లక్షల ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.