GDWL: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు ఎస్పీ టి.శ్రీనివాసరావు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతల కోసం BNSS సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా ఉండరాదని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు