SRD: పట్టణం బైపాస్ రహదారిలో పాత డీఆర్డీవోలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి నిర్మల తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఉదయం 11 గంటలకు జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలని చెప్పారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు.