KRNL: నందవరం KGBVలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు ఇవాళ ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. 5వ తరగతి, 10వ తరగతి పూర్తి చేసిన లేదా ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. బడి బయట ఉన్నవారు, అనాథలు, నిరుపేద బాలికలకు ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.