KMR: బిచ్కుందలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకాశం.. స్థానిక మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ముజాహిద్ గురువారం వార్షిక పరీక్ష రాశాడు. పరీక్ష ముగిసిన అనంతరం అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే ముజాహిద్ శనివారం పెద్దదడిగి గ్రామం సమీపంలోని కౌలాస్ నాలా కాలువలో శవమై కనిపించాడు.