శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా దర్శకత్వంలో ‘మృత్యుంజయ్’ ఇవాళ విడుదలైంది. ప్రమాదాలుగా చిత్రీకరించిన హత్యల వెనుక గుట్టును రిపోర్టర్ జయ్ ఎలా ఛేదించాడనేదే ఈ పరిశోధనాత్మక థ్రిల్లర్ కథ. శ్రీవిష్ణు నటన, ద్వితీయార్ధంలో మైండ్ గేమ్ సినిమాకు బలం. కాలభైరవ సంగీతం ఉత్కంఠను పెంచింది. సాగదీత సీన్లు ఉన్నా, థ్రిల్లర్ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. రేటింగ్: 2.75/5