WGL: కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగాల పేరుతో కొందరు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. నిర్మాణ బాధ్యతలను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు అప్పగించగా, సోషల్ మీడియాలో కాంట్రాక్ట్ ఉద్యోగాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎవరూ నమ్మవద్దని రైల్వే అధికారులు సూచించారు.