AP: భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ పదవికి అనర్హుడని మాజీమంత్రి రోజా ధ్వజమెత్తారు. ‘ఆయన రాజీనామా చేయాలి. ఇందు పరువు తీసింది బీఆర్ నాయుడే. నిజం లేకపోతే బాబు, లోకేష్, పవన్‌లకు ఇందు ఎందుకు లేఖ రాసింది. ఆయనకు మహిళలంటే గౌరవం లేదు. ఆ వీడియోపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.