KDP: బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ సమీపంలో సోమవారం బొలెరో జీప్, ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని 108 వాహనం ద్వారా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.